హంతకుడికి స్వాగతాలా?
ABN , First Publish Date - 2022-12-16T00:40:01+05:30 IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ అనంతబాబుకు వైసీపీ నాయకులు స్వాగతం పలకడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. హత్యలు చేసిన వారిని స్వాగతించడం దళిత, గిరిజన సమాజాన్ని అవమానపరచడమేనని అన్నారు.
రంపచోడవరం, డిసెంబరు 15: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ అనంతబాబుకు వైసీపీ నాయకులు స్వాగతం పలకడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. హత్యలు చేసిన వారిని స్వాగతించడం దళిత, గిరిజన సమాజాన్ని అవమానపరచడమేనని అన్నారు. దళితులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందని ఆరోపించారు. హంతకుల చిత్రపటాలకు పాలభిషేకం చేయడం అప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమన్నారు. అనంతబాబు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కారం సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి పి.అనంతమోహన్, టీడీపీ నాయకులు కారం సింహాచలం, కారం శేషాయమ్మ, వంతల అచ్చియమ్మ, కొండపల్లి వెంకటలక్ష్మి, కుంజం బాపన్నదొర, మడకం పండుదొర, కోసు రాజన్న, దుర్గాదేవి, చక్రపాణి, వెంకటలక్ష్మి, కంగల అబ్బాయిదొర, శెట్టి నర్సిరెడ్డి పాల్గొన్నారు.