సీపీఐ జిల్లా కార్యదర్శిగా మధు
ABN , First Publish Date - 2022-08-04T06:00:49+05:30 IST
సీపీఐ జిల్లా కార్యదర్శిగా తాటిపాక మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 3: సీపీఐ జిల్లా కార్యదర్శిగా తాటిపాక మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆగస్టు 1, 2 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన జిల్లా మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా మధుతో పాటు 41 మంది సమితి సభ్యులు, 11 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా కూండ్రపు రాంబాబు, రేఖ భాస్కరరావు, కార్యవర్గసభ్యులుగా వి.కొండలరావు, నల్ల భ్రమరాంబ, బి.రవిచంద్ర, సత్యనారాయణ, కె.జ్యోతిరాజు, సూరిబాబు, సీహెచ్ లక్ష్మణ్, సీహెచ్ సునీల్ ఎన్నికయ్యారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ,రావుల వెంకయ్య అభినందించారు.