దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలి
ABN , First Publish Date - 2022-08-12T06:44:21+05:30 IST
దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలని, హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయాలని ఆదికవి నన్న య విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

- నన్నయ విశ్వవిద్యాలయం వీసీ జగన్నాథరావు
- పలుచోట్ల ఆజాదీకా అమృత్ మహోత్సవ్
- జాతీయ పతాకాలతో విద్యార్థుల ర్యాలీలు
దివాన్‌చెరువు, ఆగస్టు 11: దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలని, హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయాలని ఆదికవి నన్న య విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా గురువారం పలుచోట్ల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. నన్నయ వర్శిటీలో కళాశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలాపన, నృత్యప్రదర్శనలు, నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ దేశభక్తిని ప్రతిబింబించే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవే యాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య ఎస్.టేకి, న్యాయనిర్ణేతలు ఎం.గోపాలకృష్ణ, రాజరాజేశ్వరీదేవి, భవాణి, అనిత, రేవతి, శిరీష, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.