9 నుంచి కాంగ్రెస్ పాదయాత్రలు
ABN , First Publish Date - 2022-08-04T06:07:54+05:30 IST
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లో నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈనెల 9నుంచి 15వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్నామని ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లీ తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 3: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లో నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈనెల 9నుంచి 15వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్నామని ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లీ తెలిపారు. స్థానిక కృష్ణనగర్‌లోని పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ భక్తి ముసుగులో మాతాల మధ్య చిచ్చుపెడుతూ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న బీజేపీ కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు అర్థమయ్యేరీతిలో చెప్పడానికి, స్వాతంత్య్ర సమరయోదులను గౌరవించి వారి త్యాగాలు అందరికి తెలిసేలా చేయడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యమని, ప్రతి నియోజకవర్గంలో 75 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ పోరాటం, త్యాగాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేస్తామని చెప్పారు. అనంతరం రాజమహేంద్రవరానికి చెందిన ఇజ్జరౌతు విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్‌గా నియమించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రం అందజేశారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, ఎస్సీసెల్ చైర్మన్ బత్తిన చంద్రరావు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, పార్లమెంట్ అధ్యక్షుడు హరీష్, నగర అధ్యక్షుడు ప్రేమ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.