రీ సర్వే పనులు పూర్తి చేయాలి: జేసీ

ABN , First Publish Date - 2022-12-25T00:28:26+05:30 IST

జిల్లాలో రీసర్వే నిర్వహించిన 44 గ్రామ పంచాయతీల్లో రీ సర్వే ప్రక్రియకి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంటుందని జేసీ తేజ్‌భరత్‌ తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో శనివారం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

   రీ సర్వే పనులు పూర్తి చేయాలి: జేసీ

బొమ్మూరు, డిసెంబరు 24: జిల్లాలో రీసర్వే నిర్వహించిన 44 గ్రామ పంచాయతీల్లో రీ సర్వే ప్రక్రియకి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంటుందని జేసీ తేజ్‌భరత్‌ తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో శనివారం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రీసర్వేకు సంబంధించి 13 నోటిఫికేషన్‌, ఆర్‌వోఆర్‌ ప్రచురణ పూర్తయ్యిందన్నారు. వాటికి అనుగుణంగా తార్కిక ముగింపు ఇవ్వడంపై నివే దిక ఇవ్వడం ముఖ్యమని జేసీ అన్నారు. వీటిలో అనపర్తి మండలంలో 9 గ్రా మాలు, కడియంలో 2, గోకవరం 1, బిక్కవోలు 13, రంగంపేట 1, రాజహేంద్ర వరం 2, రాజానగరం 4, నిడదవోలు 1, పెరవలి 1 గ్రామాలున్నాయని జేసీ తెలిపారు. తదుపరి రీసర్వే పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో నరసింహులు, ఆర్డీవో మల్లిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-25T00:28:28+05:30 IST