కలెక్టర్‌ కార్యాలయంలోకి వైసీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2022-04-05T06:25:05+05:30 IST

రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయం సోమవారం ప్రారంభమైంది.

కలెక్టర్‌ కార్యాలయంలోకి వైసీపీ కార్యకర్తలు

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 4: రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయం సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. కార్యాలయం ప్రారంభించాక కార్యాలయంలోకి ప్రభుత్వాధికారులను అనుమతించలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలను అనుమతించారు. అయితే వారితోపాటు వారి అనుచరగణం కూడా భారీగానే కార్యాలయంలోకి ప్రవేశించారు. ఇంతవరకు బాగానేవుంది. అయితే ప్రభుత్వం శాఖల అధికారులను మాత్రం పోలీసులు అనుమతించలేదు. కలెక్టర్‌ కార్యాలయం ముఖద్వారం లోపల గడియపెట్టి వైసీపీ నాయకులను లోపలికి అనుతించి అధికారులను బయట పెట్టారు. దీంతో తొలిరోజునే ప్రభుత్వాధికారులకు చుక్కెదురైంది. రెవెన్యూ, విద్యుత్‌, వెటర్నరీ  తదితర శాఖ అధికారులు కలెక్టర్‌ కార్యాలయం బయట వేచి ఉండడం కనిపించింది.

Read more