చింతలూరు నూకాంబికా ఉత్సవాలకు శ్రీకారం
ABN , First Publish Date - 2022-03-05T06:55:24+05:30 IST
ఉభయగోదావరి జిల్లాల్లో పేరుగాంచిన అమ్మవారి జాతరల్లో ఒకటైన చింతలూరు నూకాంబికా అమ్మ వారి జాతర బుట్టగరగతో శుక్రవారం ప్రారంభమైంది.
ఆలమూరు, మార్చి 4: ఉభయగోదావరి జిల్లాల్లో పేరుగాంచిన అమ్మవారి జాతరల్లో ఒకటైన చింతలూరు నూకాంబికా అమ్మ వారి జాతర బుట్టగరగతో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 31న జరిగే ప్రధాన జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుట్టగరగతో 15రోజులపాటు మండలంలో వివిధ గ్రామాల్లో అమ్మవారి బుట్టగరగను ఊరేగింపు జరుపుతారు. అనంతరం 15రోజులపాటు కొత్త, పాత పూల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న తీర్థం, 2న ఉగాది ఉత్సవాలు జరుగుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఆలయ అర్చకులు అమ్మవారి బుట్టగరగకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏఏస్బికే.రామలింగం, జేఏ భాస్కర్, నాయకులు నామల శ్రీనివాస్ పాల్గొన్నారు.