వాగులోకి ట్రాక్టర్‌ బోల్తా

ABN , First Publish Date - 2022-09-11T06:21:49+05:30 IST

రెండు రోజులుగా వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. దీంతో మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా సరిహద్దులలో కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుండడంతో ఆ వరద నీరంతా శబరిలోకి చేరుతోంది.

వాగులోకి ట్రాక్టర్‌ బోల్తా
వాగులోకి ట్రాక్టర్‌ బోల్తా

చింతూరు, సెస్టెంబరు 10 : రెండు రోజులుగా వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. దీంతో మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా సరిహద్దులలో కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుండడంతో ఆ వరద నీరంతా శబరిలోకి చేరుతోంది. దీంతో శబరి నీటి మట్టం కూడా పెరుగుతోంది. చింతూరు వరమరామచంద్రపురం మండలాల నడుమ చంద్రవంక వాగు, చీకటివాగు, అత్తాకోడళ్ళ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం చింతూరు వైపు నుంచి వరరామచంద్రపురం వైపు వెళుతున్న ట్రాక్టర్‌ ఒకటి అత్తాకోడళ్లవాగు ఉధృతికి చప్టామీద నుంచి ఫల్టీ కొట్టింది. కాగా వాహన చోదకుడు సురక్షితంగా బయట పడ్డాడు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో లోతట్టు వాసుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. లోతట్టు ప్రాంతాలలో ఈ ఏడాది వరదల కారణంగా ఇప్పటి వరకు వరినాట్లు వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వరద తగ్గింది కదా అని కొందరు రైతులు నాట్లకు సిద్ధపడుతుండగా మళ్లీ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో నిరాశ చెందుతున్నారు.

Read more