సర్వప్రాణి సేవే.. మాధవ సేవ

ABN , First Publish Date - 2022-06-12T06:07:44+05:30 IST

సర్వప్రాణి సేవయే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి అన్నారు.

సర్వప్రాణి సేవే.. మాధవ సేవ
త్రిదండి చిన జీయర్‌ స్వామి

త్రిదండి చిన జీయర్‌ స్వామి


ఉండ్రాజవరం, జూన్‌ 11 : సర్వప్రాణి సేవయే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి అన్నారు.  వేలివెన్ను గ్రామంలో ఒక ప్రైవే టు కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రవచనం చేశారు.సృష్టిలో ప్రతి ప్రాణిలో మాధవుడు ఉంటాడ న్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఆయన సమతా మూర్తి..  భగవంతుడు మానవు డితో పాటు ఇతర ప్రాణులను సృష్టించాడని, వాటిని కూడ ప్రేమించాలని, సేవచేయాలన్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమా నులేనన్నారు. ఎవరికి తగ్గ యోగ్యత భగవంతుడు వారికి ఇస్తాడన్నారు.ఈ కార్యక్రమంలో  శశి విద్యాసంస్థల  చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌, గమిని టెక్స్‌టైల్స్‌ అధినేత గమిని రాజా, బలభద్ర భాస్కర గుప్త పాల్గొన్నారు. 

Read more