కోడి కూర వండలేదని హత్య

ABN , First Publish Date - 2022-03-05T06:48:58+05:30 IST

చుట్టంచూపుగా వచ్చిన ఓ చెల్లికి ఆ అన్నే మృత్యువు రూపంలో ఎదురయ్యాడు. మద్యం మత్తులో క్షణికావేశంలో కోడికూర వండలేదన్న కారణంతో తన చెల్లిని గొడ్డలితో నరికి చంపాడు ఆ కసాయి సోదరుడు.

కోడి కూర వండలేదని హత్య

  • చెల్లిని గొడ్డలితో నరికి చంపిన అన్న
  • తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

కూనవరం, మార్చి 4: చుట్టంచూపుగా వచ్చిన ఓ చెల్లికి ఆ అన్నే మృత్యువు రూపంలో ఎదురయ్యాడు. మద్యం మత్తులో క్షణికావేశంలో కోడికూర వండలేదన్న కారణంతో తన చెల్లిని గొడ్డలితో నరికి చంపాడు ఆ కసాయి సోదరుడు. కూనవరం మండలం వెంకటాయిపాలెం పంచాయతీ పరిధిలోని వలస ఆది వాసీ గ్రామమైన సన్నాయిగూడెంలో జరిగిన సంఘటన ఇది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. దివ్యాంగురాలైన తాటి సోమమ్మ అలియాస్‌ కోవ్వాసి సోమిడీ(20) అనే యువతి తన తల్లిదండ్రులు చనిపోవడంతో తెలంగాణలోని కరకగూడెం మండలం మద్దన్న గ్రామంలో తన అక్క దగ్గర ఉంటోం ది. వారం కిందట అన్నయ్యను చూద్దామని కూనవరం మండలం ఆదివాసీ గ్రామమైన కన్నాపురంలోని అన్నయ్య నందా ఇంటికి వచ్చింది. అన్న భార్య కొవ్వాసి ఉంగి తన పుట్టింటికి చత్తీస్‌గడ్‌ వెళ్లడంతో నంద గురువారం రాత్రి పది గంటలకు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. నిద్రపోతున్న చెల్లిని లేపి కోడి కూర వండాలని ఆమెతో గొడవకు దిగాడు. తాను మళ్లీ వస్తానని ఈ లోపు తనకు కోడికూర వండకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మళ్లీ ఇం టికి వచ్చి చెల్లి సోమమ్మను లేపి కోడికూర వండావా అని అరిచాడు. ఆరోగ్యం బాగోలేక వండలేకపోయానని చెప్పిన సోమమ్మను గొడ్డలి తీసుకుని సోమమ్మ పై తలపై దాడి చేశాడు. దీంతో సోమమ్మ కుప్పకూలి చనిపోయింది. ఇంట్లో ఉన్న పిల్లలను, చుట్టుపక్కలవాళ్లనూ చంపేస్తానని నంద కేకలు వేశాడు. నం దాకు 8మంది సంతానం. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు నందాను తాళ్లతో కట్టేసి వలంటీర్‌కు సమాచారం అందజేశారు. సీఐ గజేంద్ర, ఎస్‌ఐ వెంకటేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more