బాల్య వివాహం అడ్డగింత

ABN , First Publish Date - 2022-02-17T05:09:07+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 16: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో ఐసీడీఎస్‌ సీడీపీవో జెస్సీఫ్లోరెన్స్‌, సచివాల

బాల్య వివాహం అడ్డగింత

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 16: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో ఐసీడీఎస్‌ సీడీపీవో జెస్సీఫ్లోరెన్స్‌, సచివాలయ పోలీసులు, వలంటీర్లు బాలిక ఇంటికి చేరుకుని బాల్య వివాహం వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. బాలికకు వివాహం చే యబోమని తల్లిదండ్రుల నుంచి అంగీకారపత్రం తీసుకున్నారు.

Read more