‘నిరుద్యోగ యువతను దగా చేసిన జగన్‌’

ABN , First Publish Date - 2022-12-31T01:09:10+05:30 IST

ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ ప్రకటన చేస్తానని ప్రగల్భాలు పలికి సీఎం జగన్‌ 1.50 కోట్ల మంది నిరుద్యోగ యువతను నిలువునా ముం చారని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరో పించారు.

 ‘నిరుద్యోగ యువతను దగా చేసిన జగన్‌’

ఉప్పలగుప్తం, డిసెంబరు 30: ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ ప్రకటన చేస్తానని ప్రగల్భాలు పలికి సీఎం జగన్‌ 1.50 కోట్ల మంది నిరుద్యోగ యువతను నిలువునా ముం చారని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరో పించారు. శుక్రవారం ఆయన నంగవరంలో విలేకరులతో మాట్లాడుతూ జనవరి 27నుంచి నారా లోకేష్‌ తలపెట్టిన యువగళం పాదయాత్రను విజయవంతంచేయాలన్నారు. అనంతరం నంగవరం, సన్నవిల్లి గ్రామాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు చిక్కం పెదబాబు, గుర్లింక చిన్నా, మాజీ ఎమ్మెల్యేలు ఏజేవీబీ మహేశ్వరరావు, చిల్లా జగదీశ్వరి, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, రవణం మధు, గాలిదేవర సురేష్‌, కడలి శ్రీనివాసరావు, చిక్కం ఉమేష్‌, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, ఆకుల వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:09:10+05:30 IST

Read more