పట్టుకుంటే రూ.పదివేలు

ABN , First Publish Date - 2022-08-04T07:15:15+05:30 IST

పిఠాపురం పట్టణంలో మహిళ మె డలో బంగారు చైన్‌ లాక్కొని ఇద్దరువ్యక్తులు పరారయ్యారు. పట్టణంలోని రాజారామ్మోహనరాయ్‌ పార్కు సెంటర్‌ సమీ పంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉన్న మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు చైన్‌ను మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్ద రు వ్యక్తులు లాక్కొని వెళ్లిపోయారు.

పట్టుకుంటే రూ.పదివేలు
మహిళ మెడలో చైన్‌ లాక్కొని మోటార్‌సైకిల్‌పై పరారవుతున్న వ్యక్తులు

  • మహిళ మెడలో చైన్‌ లాక్కొని పరారీ.. పిఠాపురంలో సంఘటన
  • ఆచూకీ తెలిపిన వారికి రూ.10వేల బహుమతి ఇస్తామని పోలీసుల ప్రకటన

పిఠాపురం, ఆగస్టు 3: పిఠాపురం పట్టణంలో మహిళ మె డలో బంగారు చైన్‌ లాక్కొని ఇద్దరువ్యక్తులు పరారయ్యారు. పట్టణంలోని రాజారామ్మోహనరాయ్‌ పార్కు సెంటర్‌ సమీ పంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉన్న మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు చైన్‌ను మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్ద రు వ్యక్తులు లాక్కొని వెళ్లిపోయారు. వీరు ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌పై వచ్చి చోరీకి పాల్పడినట్లు, ఇద్దరి వయస్సు 20-25 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు చోరీకి పాల్పడిన యువకుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల్లో రికార్డయిన చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు. వీరిని గుర్తించి సమాచారం అందించిన వారికి పోలీసుశాఖ తరపున రూ.10వేల నగదు బహుమతి అందజేస్తామని పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు తెలిపారు. సమాచారం, ఆచూకీ తెలిసిన వారు కాకినాడ డీఎస్పీ సెల్‌ 9440796505, పిఠాపురం సీఐ సెల్‌ 9440796523, పిఠాపురం పట్టణ ఎస్‌ఐ 9440796560 నెంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Updated Date - 2022-08-04T07:15:15+05:30 IST