చదరంగం, ఖోఖో, కబడ్డీ క్రీడలు భారత్‌లోనే పుట్టాయి

ABN , First Publish Date - 2022-12-07T01:58:44+05:30 IST

చదరంగం, ఖోఖో, కబడ్డీ క్రీడలు భారత దేశంలోనే పుట్టాయని, ప్రస్తుత కాలంలో ఖోఖోకి మంచి ఆదరణ లభి స్తోందని అంతర్జాతీయ చదరంగం క్రీడాకారుడు లంకా రవి అన్నారు.

చదరంగం, ఖోఖో, కబడ్డీ క్రీడలు భారత్‌లోనే పుట్టాయి

ముగిసిన సీబీఎస్‌ఈ ఖోఖో పోటీలు

దివాన్‌చెరువు, డిసెంబరు 6: చదరంగం, ఖోఖో, కబడ్డీ క్రీడలు భారత దేశంలోనే పుట్టాయని, ప్రస్తుత కాలంలో ఖోఖోకి మంచి ఆదరణ లభి స్తోందని అంతర్జాతీయ చదరంగం క్రీడాకారుడు లంకా రవి అన్నారు. దివాన్‌ చెరువులోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో జరుగుతున్న ఆంధ్ర, తెలంగాణా సీబీఎస్‌ఈ పాఠశాలల అండర్‌-19 బాలుర, బాలికల విభాగాల్లో మూడురోజులపాటు ఖోఖో పోటీలు జరిగాయి. మంగళవా రం జరిగిన ముగింపు సభకు రవి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ క్రీడాకారులకు ఎన్నో ఉద్యోగవ కాశాలు లభిస్తున్నాయన్నారు. అనంతరం శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థల కార్యదర్శి సీహెచ్‌ విజయప్రకాష్‌ మాట్లాడుతూ క్రీడాకా రులు చదువుతోపాటు క్రీడల్లోను నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. ఈ పోటీల్లో ప్రథమ బహమతి కైవసం చేసుకున్న బాలురు, బాలికలు త్వరలో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి పో టీల్లో పాల్గొంటా రన్నారు. విజేతల వివరాలను స్థానిక శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ ప్రిన్సిపాల్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తి ప్రకటించారు. బాలుర విభాగం నుంచి పాయక రావుపేట శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ జట్టు, బాలికల విభాగం నుంచి హీల్స్‌ స్కూల్‌ (కృష్ణ) ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి. బాలుర విభాగంలో ద్వితీయ బహుమతిని ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై స్కూల్‌ (హైదరాబాద్‌), తృతీయ బహుమతిని భారతీయ విద్యాభవన్‌ (తాడేప ల్లిగూడెం) పరిమితి స్కూల్‌ (కరీంనగర్‌) గెలుచుకోగా బాలికల విభాగంలో ద్వితీయ బహుమతిని భారతీయ విద్యాభవన్‌ (భీమవరం), తృతీయ బహుమతిని శ్రీప్రకాష్‌ రెసిడె న్షియల్‌ (నల్గొండ), సిస్టర్‌ నివేదిత స్కూల్‌ (హైదరాబాద్‌) గెలుచుకున్నాయి.

హ్యాండ్‌ బాల్‌ విజేతలు గుంటూరు, నంద్యాల

సామర్లకోట, డిసెంబరు 6: కాకినాడ జిల్లా సామర్లకోటలో ప్రభుత్వ కళాశాల ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 37వ బాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ క్రీడాపోటీలు మంగళవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల నుంచి బాలిక జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌ పోటీలలో గంటూరు-నంద్యాల మధ్య జరిగిన పోటీలో 5పాయింట్ల తేడాతో గుంటూరు జట్టు గెలుపొంది ప్రథమస్థానాన్ని కైవసం చేసుకోగా రన్నర్‌గా నంద్యాల నిలిచింది. తృతీయ స్థానాన్ని నెల్లూరు, నాల్గోస్థానాన్ని పశ్చిమగోదావరి జిల్లా జట్లు కైవసం చేసుకున్నాయి. ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కె. పద్మనాభం, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆంజనేయులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అరుణ, వైస్‌చైర్మన్లు జాన్‌మోజెస్‌, సునేత్రాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ నయీంఅహ్మద్‌ విజేతలకు బహుమతులు, షీల్డ్‌లు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో దవులూరి సుబ్బారావు, టీవీఎస్‌.రంగారావు, పి.లక్ష్మణరావు, ఎండీవీ.ప్రసాద్‌, సునీల్‌దేశాయ్‌ తదితర కౌన్సిలర్లు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:58:46+05:30 IST