నిలిచిన సీసీసీ నిర్వహణ

ABN , First Publish Date - 2022-04-24T07:10:38+05:30 IST

కాకినాడ స్మార్ట్‌సిటీ తలమానికంగా నిలిచిన సీసీసీ(కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) స్టెరిలైజ్‌ నిర్వహణలో ఎన్నో సేవలందించింది. ఇతర జిల్లా స్మార్ట్‌సిటీ చైర్మన్లు, అధికారులు కూడా కాకినాడ సీసీసీ సందర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

నిలిచిన సీసీసీ నిర్వహణ
స్ర్కీన్‌పై ఎలిమేట్స్‌ డౌన్‌ చూపిస్తున్న దృశ్యంనిలిచిన సీసీసీ సేవలు

  • సీటీవో గైర్హాజరు
  • ఎన్ని షోకాజ్‌లు ఇచ్చినా పట్టించుకోని వైనం

కార్పొరేషన్‌(కాకినాడ), ఏప్రిల్‌ 23: కాకినాడ స్మార్ట్‌సిటీ తలమానికంగా నిలిచిన సీసీసీ(కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) స్టెరిలైజ్‌ నిర్వహణలో ఎన్నో సేవలందించింది. ఇతర జిల్లా స్మార్ట్‌సిటీ చైర్మన్లు, అధికారులు కూడా కాకినాడ సీసీసీ సందర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టెరిలైజ్‌ సంస్థకు రూ.19.50కోట్లు నిధులు బకాయిలు ఉండడంతో ఆ సంస్థ పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎటువంటి విద్యార్హతలు లేని ఒక వ్యక్తికి స్మార్ట్‌సిటీ పగ్గాలు అప్పగించి నెలకు రూ.1.60 లక్షలు జీతం చెల్లిస్తోంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అధికారులకు తెలిసొ చ్చింది. కొన్నిరోజులుగా సీసీసీ సేవలు కాకినాడ ప్రజలకు అందక నగరంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానకూడల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడంతోపాటు  టోల్‌ఫ్రీ, వైఫై, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు, నెంబర్‌ ప్లేట్లు, ఫేస్‌ రికగ్నేషన్‌, వీఎండీలు, పబ్లిక్‌ ఎనౌన్స్‌మెంట్లు, ఎస్‌వోఎస్‌లు ఇలా సీసీసీ ఆధ్వర్యంలో 1449 ఎలిమేట్స్‌ పనిచేస్తుండగా ప్రస్తుతం 735 ఎలిమేట్స్‌ డౌన్‌ అయ్యి ఈ సేవలు అన్నీ నిలిచిపోయాయి. సీసీసీ ఆధారంగా నగరంలో ఎక్కడ ఏసమస్య వచ్చినా అధికారుల సమన్వయంతో క్షణాల్లో పరిష్కరించేశా రు. సీసీసీ సేవలు నిలిచిపోవడంతో ఇప్పుడు పలు సమస్యలు పెరగడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

సీటీవో గైర్హాజరు

సీసీసీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీటీవో(చీప్‌ టెక్నికల్‌ ఆపీసర్‌), రామారావు విధులకు గైర్హాజరులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన గైర్హజరుతోనే సీసీసీ పలు సమస్యలు తలెత్తున్నాయని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌సిటీ అధికారులకు గానీ, సిబ్భందికి గానీ ఎటువంటి సమాచారం లేకుండా ఆయనకు ఆయనే సెలువు ప్రకటించుకోవడంతో సిబ్భంది ఎద్దెవా చేస్తున్నారు. ఇంతలో ఆయనకు ఎటువంటి ఆహ్వానం లేకపోయినా గుజరాత్‌ రాష్ట్రంలో సూరత్‌లో జరిగిన స్మార్ట్‌సిటీల సదస్సులో ప్రత్యేక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచే సింది. 

మూడు షోకాజ్‌లు

స్టెరిలైజ్‌ బాధ్యతలు నుంచి తప్పుకున్న తరువాత కొత్తకంపెనీకి టెండర్‌ నోటీసు ఇవ్వడానికి స్మార్ట్‌సిటీ  ఎస్‌ఈ సత్యనారాయణరాజు సమాచారం అడిగినప్పటికీ సీటీవో స్పందించకపోవడంతో షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దీనిపై ఎస్‌ఈ నన్ను వేధిస్తున్నారంటూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఎమ్‌ఐయూడీ(మినిస్టిర్సీ ఆఫ్‌ హౌసింగ్‌ అర్భన్‌ ఎఫెర్స్‌), జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకినాడ స్మార్ట్‌ సీసీసీ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. అనుమతులు లేకుండా సీటీవో గుజరాత్‌ వెళ్లడంపై స్మార్ట్‌సిటీ ఎండీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు రెండోసారి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. కొన్నిరోజులు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై మూడో షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. గత కమిషనర్‌ సమయంలో కూడా పలు షోకాజ్‌లు తీసుకున్నా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. స్మార్ట్‌సిటీ ఉద్యోగులతో కూడా ఆయనకు సఖ్యత లేకపోవడంతో సిబ్భంది ఏకమై కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Updated Date - 2022-04-24T07:10:38+05:30 IST