Marriage: పీటల మీద ఆగిన పెళ్లి.. పెళ్లికుమార్తె, ప్రియుడితో కలిసి..!

ABN , First Publish Date - 2022-12-15T20:29:57+05:30 IST

అబ్బాయిది కాకినాడ జిల్లా (Kakinada District) కొత్తపల్లి మండలం వాకతిప్ప. అమ్మాయిది తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రంగంపేట.

Marriage: పీటల మీద ఆగిన పెళ్లి.. పెళ్లికుమార్తె, ప్రియుడితో కలిసి..!

కొత్తపల్లి: అబ్బాయిది కాకినాడ జిల్లా (Kakinada District) కొత్తపల్లి మండలం వాకతిప్ప. అమ్మాయిది తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రంగంపేట. వీళ్లిద్దరి పెద్దలు ఇష్టంతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాని ప్రకారంగా బుధవారం రాత్రి పెళ్లి కుమారుని ఇంటివద్ద వివాహం జరిపించేందుకు పెద్దఎత్తున లైటింగ్‌, విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సంతోషంగా ఒక పక్క విందు ఆరగిస్తున్నారు. పెళ్లికుమార్తెను, పెళ్లికుమారుడుని పీటల మీదికి తీసుకొచ్చి లాంఛనంగా పూజలు చేయడం ప్రారంభించారు. తాళికట్టే సమయానికి తనకు ఇష్టంలేదని పెళ్లికుమార్తె తెగేసి చెప్పేసింది. పెళ్లికుమార్తె ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం ప్రియునితో తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఐసీడీఎస్‌కు సమాచారం చేరవేసింది. దీంతో ఐసీడీఎస్‌ సిబ్బంది, పోలీసులు రంగప్రవేశం చేసి ఆరా తీశారు. తాను మైనర్‌నని, తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని అధికారుల ముందు పెళ్లికుమార్తె చెప్పింది. మైనర్‌ బాలికకు వివాహం చేయడం నేరమని తాత్కాలికంగా పెళ్లిని వాయిదా వేయించారు. ఘనంగా పెళ్లి ఏర్పాటు చేసుకొన్న అబ్బాయి తరపున బంధువులు పెళ్లి మండపంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలను చూసి నివ్వెరపోయారు.

Updated Date - 2022-12-15T20:30:49+05:30 IST