విజయవంతంగా అవయవాల తరలింపు

ABN , First Publish Date - 2022-03-05T05:54:12+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ అవయవాలను శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా విశాఖకు తరలించారు.

విజయవంతంగా అవయవాల తరలింపు
అవయవాల తరలింపు

 సర్పవరం జంక్షన్‌, మార్చి 4: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ అవయవాలను శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా విశాఖకు తరలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ కరణం కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు సర్పవరం జంక్షన్‌లో ఉన్న ట్రస్ట్‌ పాత ఆస్పత్రి నుంచి అవయవాలను రవాణా చేసేందుకు వీలుగా ఎటువంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. ట్రస్ట్‌ ఆసుపత్రి డాక్టర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు అవయవాలను విశాఖకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవయవాలను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సహకారంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు విశాఖ అపోలో ఆస్పత్రికి చేర్చినట్లు డాక్టర్‌ రామకృష్ణ తెలిపారు. మూత్ర పిండ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా జరిగిందన్నారు. గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసిన ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 Read more