బీజేపీ గోదావరి గర్జన

ABN , First Publish Date - 2022-06-07T06:59:22+05:30 IST

వచ్చే ఎన్నికలలో రాజకీయంగా ఉన్నతి సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఆర్స్ట్‌ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం గోదావరి గర్జన పేరిట సభ నిర్వహించనుంది.

బీజేపీ గోదావరి గర్జన

  (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి) వచ్చే ఎన్నికలలో రాజకీయంగా ఉన్నతి సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఆర్స్ట్‌ కాలేజీ గ్రౌండ్‌లో  మంగళవారం గోదావరి గర్జన పేరిట సభ నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చే యనున్నారు. సోమవారమే ఆయన విజయవాడ చేరుకున్నారు.  మంగళవారం 11.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు వచ్చి, అక్కడ నుంచి రాజమహేంద్రవరం చేరుకుంటారు. సాయంకాలం ఐదు గంటలకు  ఆర్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో పార్టీ ఆధ్వర్యంలో జరిగే గోదావరి గర్జన సభ పాల్గొంటారు. ఇప్పటికే బీజేపీ నేతలు ఈ గ్రౌండ్‌లో సభా ఏర్పాట్లను పూర్తి చేశారు. విశాలమైన వేదిక, క్యాడర్‌కు కుర్చీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై  గర్జి స్తామని నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో పట్టు సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఈ సభ ద్వారా క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.  
ఈ సభకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రత్యేక ఆసక్తితో ఉంది. బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఎక్కడా కలసి కార్యక్రమాలు చేయడం లేదు. ఇటీవల కాలంలో పొత్తులకు సంబంధించి పలు అంశాలు తెరమీదకు వచ్చాయి. పవన్‌కల్యాణ్‌ పొత్తులపై ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మిత్ర పక్షమైన జనసేనతో భవిష్యత్‌ ప్రయాణం ఎలా ఉండబోతు ందనేదానిపై బీజేపీ అధ్యక్షుడు ఒక స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భా విస్తున్నాయి. అలాగే రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగే సభలో జనసేన-బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ను ప్రకటిస్తే తాము స్వాగతిస్తామని పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అంతే కాకుండా విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఏమి చేసిందో కూడా వివరంగా చెబితే మంచిదని కూడా బీజేపీ నేతలకు జనసేన నేతలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభలో నడ్డా  ఏం మాట్లాడతారనేదానిపై ఆసక్తి నెలకొంది.
ఎస్సీ వర్గీకరణపై వైఖరేంటి?
ఎస్సీ వర్గీకరణ చేస్తామని గత ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిందని కానీ ఇంతవరకూ చేయలేదని, రాజమహేంద్రవరం సభలో ఎస్సీ వర్గీకరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పార్టీ వైఖరిని ప్రకటించాలని, లేకపోతే సభను అడ్డుకుంటామని మాదిగ రాజకీయ పోరాట సమితి కన్వీనర్‌ ఆకుమర్తి చిన్నమాదిగ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అయితే ఈ అంశంపై బీజేపీ వైఖరిని ఎప్పటినుంచో ఎమ్మార్పీఎస్‌ కోరుతోంది. హామీ ఇచ్చిన విధంగా అమలు చేసి చిరకాల కలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు కోరుతున్నారు.

Read more