బయో మెడికల్‌ వ్యర్థ ఫ్యాక్టరీ నిర్మాణం తగదు

ABN , First Publish Date - 2022-08-15T06:37:32+05:30 IST

మర్రిపూడిలో నిర్మిస్తున్న బయో మెడికల్‌ వ్యర్థ ఫ్యాక్టరీ నిర్మాణం తగదని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు.

బయో మెడికల్‌ వ్యర్థ ఫ్యాక్టరీ నిర్మాణం తగదు

రంగంపేట, ఆగస్టు 14: మర్రిపూడిలో నిర్మిస్తున్న బయో మెడికల్‌ వ్యర్థ ఫ్యాక్టరీ నిర్మాణం తగదని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దంటూ మర్రిపూడి, చినబ్రహ్మదేవం, జి. కొత్తూరు, ఆర్‌వి. పట్నం, కొండపల్లి గ్రామ ప్రజలు రెండు రోజులుగా చేపట్టిన శాంతియుత నిరసనలకు ఆయన ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని, నిర్మాణం ఆపాలన్నారు. ఆయా గ్రామాల ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, పోలీసులు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయరాదన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానన్నారు. ఈయన వెంట జెడ్పీటీసీ పి.రాంబాబు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు లంక చంద్రన్న, సర్పంచ్‌లు మాధవి, శ్రీను, రాంబాబు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read more