నేడు వినాయక చవితి

ABN , First Publish Date - 2022-08-31T06:06:39+05:30 IST

చెవిలో చెబితే చాలు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఉభయ తెలుగు రాష్ట్ర్టాల్లో ప్రసిద్ధికెక్కిన బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేడు వినాయక చవితి

 బిక్కవోలులో ఘనంగా ఏర్పాట్లు

 బిక్కవోలు, ఆగస్టు 30: చెవిలో చెబితే చాలు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఉభయ తెలుగు రాష్ట్ర్టాల్లో ప్రసిద్ధికెక్కిన బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు.  1100 సంవత్సరాల క్రితం పంటపొలాల్లో తూర్పు చాళుక్యుల కాలంలో స్వామి స్వయంభూగా వెలిశాడు. అప్పట్లో తూర్పు చాళుక్యులు యుద్ధాలకు వెళ్లే ముందు స్వామికి పూజలు చేసి వెళ్లి విజయాలు సాధించేవారట. కాలక్రమేణ పిండారీలు, తురుష్కుల దాడుల్లో స్వామివారి విగ్రహాన్ని పెకిలించి వేయడానికి ప్రయత్నించగా స్వామివారి విగ్రహం ఎంత మాత్రం కదలలేదట. దీంతో స్వామివారి తొండం, ఇతర భాగాలు కొద్దిగా దెబ్బతిన్నాయి. 19వ శతాబ్దంలో గ్రామస్థులు కొందరు స్వామివారిని గుర్తించి చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చిన్న గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆపై స్వామివారి చెవిలో కోర్కెలు చెబితే నెరవేరడంతో నిత్యం భక్తుల సంఖ్య పెరిగింది. పురాతనమైన స్వామి కావడంతో పురావస్తుశాఖ ఆధీనంలో ఈ ఆలయం వున్నా, దేవదాయశాఖ ఆధ్వర్యంలోనే స్వామికి నిత్యం పూజలు చేస్తుంటారు. స్వామి దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడంతో దేవదాయశాఖ నిత్యాన్నదానాన్ని కూడా నిర్వహిస్తోంది. వినాయక చవితికి బిక్కవోలుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2022-08-31T06:06:39+05:30 IST