బీసీల అణచివేతే లక్ష్యంగా జగన్‌రెడ్డి పాలన

ABN , First Publish Date - 2022-12-07T01:55:01+05:30 IST

సీపీ ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప బీసీలకు ఒరిగిందేమిటి అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తె

బీసీల అణచివేతే లక్ష్యంగా   జగన్‌రెడ్డి పాలన

సామర్లకోట, డిసెంబరు 6: వైసీపీ ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప బీసీలకు ఒరిగిందేమిటి అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సామర్లకోట పట్టణంలో ఇదేం ఖర్మ మన బీసీలకు పేరిట నిరసన కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినపుడే పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కానీ జగన్‌ రెడ్డి ప్రతిరోజూ బీసీలను ఉద్ధరించా, వారి జీవితాలు మార్చేసా అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ బీసీలను పూర్తిగా మోసం చేస్తున్నారన్నారు. మూడున్నరేళ్ల కాలంలో ఎంతమందికి స్వయం ఉపాధి రుణాలను ఇచ్చారో జగన్‌ చెప్పాలన్నారు. గతంలో కార్పొరేష న్లు అంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రాలుగా ఉండేవన్నారు. కానీ జగన్‌రెడ్డి పాలనలో వాటిని కేవలం రాజకీయ నిరుద్యోగుల ఆవాస కేంద్రా లుగా మార్చారన్నారు. బీసీల అసైన్డ్‌ భూములు 8 వేల ఎకరాలు బలవం తంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి పరికరాలు తుప్పుపట్టించారన్నారు. లబ్ధిదారులు 10 శాతం సొమ్ము స్వాహా చేశారన్నారు. బీసీలకు విదేశీ విద్య, పెళ్లి కానుకలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దు చేశార న్నారు. బీసీ భవనాలను పూర్తిగా నిలిపివేశారన్నారు. 26 మంది బీసీ నేతల ను హత్య చేశారని, 650 మంది బీసీలపై తప్పుడు కేసులు బనాయించారని, 2,500 మందిపై దాడులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, అడబాల కుమారస్వామి, కంటే బాబు, బలుసు శ్రీనివాసు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, కందుల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:55:02+05:30 IST