బీసీలకు పూర్వవైభవం రావాలంటే.. టీడీపీని అధికారంలోకి తేవాలి

ABN , First Publish Date - 2022-11-28T01:19:22+05:30 IST

బీసీలకు పూర్వవైభవం రావాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని ఆ పార్టీ బీసీ నాయకులు పిలుపునిచ్చారు.

బీసీలకు పూర్వవైభవం రావాలంటే..  టీడీపీని అధికారంలోకి తేవాలి

ద్రాక్షారామ, నవంబరు 27: బీసీలకు పూర్వవైభవం రావాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని ఆ పార్టీ బీసీ నాయకులు పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం చోడవరం విజయ ఫంక్షన్‌ హాలులో శెట్టిబలిజ సాధికారత కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం జరిగింది. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌, టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, బీసీ ఫెడరేషన్‌ చైర్మన్‌ కొల్లు రవీంద్ర మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా రెండు లక్షల సబ్సిడీ రుణాలు, విదేశీవిద్యకు రూ.10లక్షల నుంచి రూ.20 లక్షలు వరకు ఆర్థిక సాయం, కులవృత్తులకు ఆదరణ పథకం, సామాజిక భవనాలు నిర్మాణాలకు నిధులు, బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించామన్నారు. సీఎం జగన్‌ వీటన్నిటినీ ఎత్తివేశారన్నారు. 56 కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, తనతో సహా ఎంతోమంది బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. టీడీపీ బీసీ నాయకులు 26 మందిని హతమార్చారన్నారు. బీసీలు సరైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో బీసీ వర్గాలకు సీఎం జగన్‌ సమాఽధులు కడతారన్నారు. టీడీపీని అఽధికారంలోకి తీసుకురావడానికి బీసీలు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ బలహీనవర్గాల పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో జగన్‌ రాజకీయ ఉచ్చులో బీసీలు పడ్డమాట వాస్తవమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు సరైన వాటా కల్పించే కృషిలో భాగమే ఈ సాధికారత కమిటీలు అన్నారు. పరిశీలకుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధు డు గౌతు లచ్చన్న జయంతి, వర్ధంతిలను ప్రభుత్వ కార్యక్రమంగా చేయాలని జీవో ఇస్తే జగన్మోహన్‌రెడ్డి దానిని అమలు చేయని దుర్మార్గుడన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీఎం జగన్‌ నిధులు, విధులు లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు సూచనతోనే 56 కులాలకు 56 సాధికారిత కమిటీలు వేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు కేటాయిస్తామన్నారు. ఎన్టీఆర్‌ బీసీలకు స్థానిక సంస్థల్లో రాజ్యధికారం కల్పించారని కొనియాడారు. తనకు చట్టసభల్లో ప్రవేశించి అధ్యక్షా అనాలని కోరిక ఉండేదని... అటువంటిది చంద్రబాబు తనకు ఎమ్మెల్సీలు, మంత్రులు అధ్యక్షా అని సంబోధించే స్థానం కల్పించారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పిల్లి సత్తిబాబు, శెట్టిబలిజ సాధికారిత కమిటీ కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు, నాయకులు పెచ్చెట్టి చంద్రమౌళి, విజయలక్ష్మి, గుత్తుల సాయి మాట్లాడారు. డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల శెట్టిబలిజ సాధికారిత కమిటీల కార్యవర్గాలతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. పూర్వపు ఉభయగోదావరి జిల్లాలనుంచి అధికసంఖ్యలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు హాజరయ్యారు.

బీసీ నాయకుల తీర్మానాలు

వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గించిన 10శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాలని, 56బీసీ కార్పొరేషన్లకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో బీసీలకు భవనాలు నిర్మించాలని తీర్మానించారు.

.మూర్తి, అకడమిక్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:19:25+05:30 IST