హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
ABN , First Publish Date - 2022-10-29T01:15:44+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో అమలాపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏడవ సబ్ జూనియర్స్ బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు రెండో రోజైన శుక్రవారం హోరాహోరీగా జరిగాయి
అమలాపురం టౌన, అక్టోబరు 28: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో అమలాపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏడవ సబ్ జూనియర్స్ బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు రెండో రోజైన శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. విజేతల వివరాలను అసోసియేషన కార్యదర్శి సంసాని వెంకటగంగాధర్ ప్రకటించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ పీఎస్ సురేష్‌కుమార్, ఏపీ సెలక్షన కమిటీ చైర్మన ఎన.అప్పలరాజు, సంసాని వెంకటచంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రముఖులు పోటీలను పర్యవేక్షించారు. అండర్-13 బాలుర విభాగంలో కర్నూలు జిల్లా జట్టు చిత్తూరు జిల్లా జట్టుతో తలపడింది. 46 పాయింట్లు సాధించిన కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు 42 పాయింట్లు, నెల్లూరు జట్టు 14 పాయింట్లు సాధించగా గుంటూరు జట్టు విజేతగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా జట్టు 45 పాయింట్లు, శ్రీకాకుళం జట్టు 5 పాయింట్లు సాధించగా తూర్పు గోదావరి విజయం సాధించింది. అనంతపురం జట్టు 26 పాయింట్లు, గుంటూరు జట్టు 14 పాయింట్లు సాధించగా అనంతపురం విజయాన్ని దక్కించుకుంది. చిత్తూరు జట్టు 14 పాయింట్లు, విశాఖపట్నం జట్టు 52 పాయింట్లు సాధించగా విశాఖపట్నం విజేతగా నిలిచింది. తూర్పు గోదావరి జట్టు 40 పాయింట్లు, గుంటూరు 8 పాయింట్లు సాధించగా తూర్పు గోదావరి విజయం సాధించింది. బాలికల విభాగంలో కర్నూలు జట్టు 12 పాయింట్లు, శ్రీకాకుళం జట్టు 8 పాయింట్లు సాధించగా కర్నూలు జిల్లా జట్టు విజయం సాధించింది. రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బాస్కెట్‌బాల్ పోటీలు కొనసాగాయి. పోటీలను అసోసియేషన అధ్యక్షుడు కుడుపూడి సుబ్రహ్మణ్యం, ప్రముఖ క్రీడాకారుడు, సీఐ ప్రశాంతకుమార్ తదితరులు పర్యవేక్షించారు.