బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి సహకారం
ABN , First Publish Date - 2022-07-03T05:58:43+05:30 IST
జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తానని బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.

- రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 2: జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తానని బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శనివారం నారాయణపురంలోని నగరపాలక సంస్థ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో కొత్తపల్లి సత్యనారాయణ మెమోరియల్ జిల్లా సెలక్షన్ కం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలకు ఎన్నడూలేని విధంగా అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడంతో క్రీడా చైతన్యం వెల్లివిరుస్తోందన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని కోరారు. రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆదివారం పోటీల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దూడల త్రినాధ్, అత్తిలి సత్యనారాయణ, మద్దూరి శంకర్, కోశాధికారి బెజవాడ వెంకట్, ఈవెంట్ సెక్రటరీ కర్రి నాగేశ్వరరావు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.