ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం

ABN , First Publish Date - 2022-09-29T06:08:58+05:30 IST

కార్పొరేషన్‌, సెప్టెంబరు 28: ఆర్టీసీ కార్గో సేవలు మరింత విస్తృతం చేయాలని, ప్రజలకు చేరువకావాలని విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ సీహె

ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం

కార్పొరేషన్‌, సెప్టెంబరు 28: ఆర్టీసీ కార్గో సేవలు మరింత విస్తృతం చేయాలని, ప్రజలకు చేరువకావాలని విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. కాకినాడ బస్టాండ్‌లో నూతనంగా నిర్మించిన కార్గో డెలివరీ పాయింట్‌ను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్గో వ్యాపారం మరింత పెరిగేలా అందరూ కృషి చేయాలని, వినియోగదారులకు సకాలంలో పార్సిల్‌ అందజేయాలన్నారు. జిల్లా ప్రజా రవాణాఅధికారి ఎం.శ్రీనివాసరావు, డిపోమేనేజర్‌ ఎంయువి.మనోహర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ టి.బాలకృష్ణ, స్టేషన్‌ మేనేజర్‌ జి.శ్రీనివాస్‌ ఉన్నారు.Read more