ఏపీఐఐఏటీపీతో సాగునీటి చెరువుల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-09T00:47:09+05:30 IST

జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంలో(ఏపీఐఐఏటీపీ) భాగంగా సాగునీటి చెరువుల అభి వృద్ధికి చర్యలు చేపడుతున్నామని జిల్లా భూగర్భ జలశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.రాధాకృష్ణ వెల్లడించారు.

ఏపీఐఐఏటీపీతో సాగునీటి చెరువుల అభివృద్ధి

ఏలేశ్వరం, డిసెంబరు 8: జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంలో(ఏపీఐఐఏటీపీ) భాగంగా సాగునీటి చెరువుల అభి వృద్ధికి చర్యలు చేపడుతున్నామని జిల్లా భూగర్భ జలశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం తూర్పులక్ష్మీపురం గ్రామంలో ఎంపీటీసీ సభ్యులు యిజనగిరి శివప్రసాద్‌ అధ్యక్షతన ఏపీఐఐఏటీపీ పథకంలో భాగంగా వ్యవసాయ, సాంఘిక అభివృద్ధి సంస్థ, జలవనరుల శాఖల ఆధ్వర్యంలో పంటలు-నీరు ప్రణాళికలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. పలువురు అధికారులు, మల్లుదొర సాగునీటి చెరువు ఆయకట్టు రైతులతో నిర్వహించిన ఈ సదస్సుకు రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో సాగునీటి చెరువుల అభివృద్ధి, భూగర్భజల యాజమాన్య నిర్వహణ పద్ధతులు, పంటల సాగుకు నీటి వినియోగం తదితర పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు ప్రయోజనం కల్పించేలా 120 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కలిగిన మల్లుదొర చెరువు అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై గ్రామస్థుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యిజనగరి శివప్రసాద్‌, జిల్లా భూగర్భజలశాఖ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏఆర్‌ఎస్‌.మూర్తి, టెక్నికల్‌ అసిస్టెంట్లు వై.శ్రీను, ఎం.అన్నవరం, వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ సువర్ణ, గ్రామ మాజీ సర్పంచ్‌లు నైనాలశెట్టి బాబ్జి, సత్యనారాయణ, శివశంకర్‌, కుమార్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T00:47:10+05:30 IST