రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన

ABN , First Publish Date - 2022-09-24T07:12:49+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతుందని, దానిని అంతమొందించడానికి ప్రతీ టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంటు టీడీపీ పరిశీలకుడు బండారు సత్యనారాయణమూర్తి కోరారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన

కొత్తపేట, సెప్టెంబరు 23: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతుందని, దానిని అంతమొందించడానికి ప్రతీ టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంటు టీడీపీ పరిశీలకుడు బండారు సత్యనారాయణమూర్తి కోరారు. శుక్రవారం స్థానిక కాపు కల్యాణ మండపంలో కొత్తపేట నియోజక వర్గ టీడీపీ ఆర్పీఎస్‌ సమావేశం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగింది.  ముఖ్య అతిథిగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌చార్జులు, బూత్‌ కన్వీనర్లు ఓటరు లిస్టుపై దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన ప్రతి పక్షంగా ప్రజల పక్షాన సమస్యలపై పోరాడాలని కోరారు.  సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, పార్టీ పరిశీలకుడు షేక్‌ మేరా, ఆకుల రామకృష్ణ, దండంగి మమత, కేతా శ్రీను, గొల్లపూడి భాస్కరరావు, బీర ఇసాక్‌, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల కన్వీనర్లు  పాల్గొన్నారు. Read more