ఎంతిస్తారు

ABN , First Publish Date - 2022-09-11T07:14:33+05:30 IST

జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల నియామక ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు రూ.20వేలు, ఆయా పోస్టుకు రూ.5నుంచి రూ.10వేలకు బేర సారాలు జరిపి చివరిగా ఎమ్మెల్యే చెప్పిన వారికి మాత్రమే అవకాశం కల్పి స్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎంతిస్తారు

  • జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులకు బేరసారాలు
  • ఇంటర్వ్యూలు ముగిసినా జాబితా బయటపెట్టని వైనం
  • కార్యాలయ ఉద్యోగి కనుసన్నల్లోనే బేరాలు
  • చివరిగా ఎమ్మెల్యే చెప్పిన వారికే అవకాశం

పోర్టుసిటీ(కాకినాడ), సెప్టెంబరు 10: జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల నియామక ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు రూ.20వేలు, ఆయా పోస్టుకు రూ.5నుంచి రూ.10వేలకు బేర సారాలు జరిపి చివరిగా ఎమ్మెల్యే చెప్పిన వారికి మాత్రమే అవకాశం కల్పి స్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బేరసారాలు మొత్తం కాకినాడ జిల్లా సీడీపీవో కార్యాలయంలోని ఓ ఉద్యోగి కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. రెండు డివిజన్లకు సం బంధించి దాదాపుగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి జాబితా బయట పెట్టకుం డా బేరాలు ఆడుతూ అధిక మొత్తంలో సొమ్ములు చేసుకునే పనిలో ఉన్నరన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ సంగతి..

జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం డివిజన్లల్లో పది ప్రాజెక్టులు ఉండగా 1986 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే అంగన్‌వాడీ కార్య కర్తలు, ఆయా పోస్టులకు ఖాళీలు ఏర్పడితే రెండేళ్లకొకసారి నోటిఫి కేషన్‌ జారీ చేసి నియామకాలు చేపడతారు. అలా ఈ ఏడాది ఆగస్టు నెలలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసి నియా మక ప్రక్రియ ప్రారంభించారు. దీనికి సంబంధించి పెద్దాపురం ప్రాజెక్ట్‌లో ఆయా పోస్టులు 10, రంగంపేట ప్రాజెక్ట్‌లో కార్యకర్త 1, ఆయా 7, శంఖవ రం ప్రాజెక్ట్‌లో కార్యకర్తలు 3, ఆయాలు 13, తుని ప్రాజెక్ట్‌లో కార్యకర్తలు 4, ఆయాలు 14, తుని అర్బన్‌ ప్రాజెక్ట్‌లో ఆయాలు 3, పిఠాపురం ప్రాజెక్ట్‌లో ఆయాలు 15, కాకినాడ డివిజన్‌కి సంబంధించి సామర్లకోట ప్రాజెక్ట్‌లో కార్యకర్తలు 2, ఆయాలు 3, సామర్లకోట రూరల్‌ ప్రాజెక్ట్‌లో కార్యకర్త 1, ఆయాలు 21, తాళ్లరేవు ప్రాజెక్ట్‌లో కార్యకర్తలు 4, ఆ యాలు 15, కాకినాడ ప్రాజెక్ట్‌లో కార్యకర్తలు 2, ఆయాలు 16మందికిగాను నోటిషికేషన్‌ జారీ చేశారు. పెద్దాపురం, కాకినాడ రెండు డివిజన్లకు గాను కార్యకర్తలు 17, ఆయాలు 117 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభిం చారు. పెద్దాపురం డివిజన్‌కి సంబంధించి సెప్టెంబర్‌ 6న, కాకినాడ డివిజ న్‌లోని సామర్లకోట ప్రాజెక్టులకు సెప్టెంబర్‌ 7న, తాళ్లరేవు ప్రాజెక్ట్‌కు 8న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాకినాడ అర్బన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించ కపోవడం గమనార్హం.

తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు తూతూమంత్రంగా సాగించారు. ఈ నియామకాల్లో కమిటీ సభ్యులుగా జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, డీఎంఅండ్‌హెచ్‌వో, సీడీపీవో, పీడీ.. ఇలా ఐదుగురు సభ్యులుగా వ్యవహరిస్తారు. కానీ ఈ ఇంటర్వ్యూలకు కేవలం సీడీపీవో, పీడీలు మాత్రమే ఉండి నామమాత్రంగా నిర్వహించారని సమాచారం. అంగన్‌వాడీ కార్యకర్తకు పదోతరగతి ఉత్తీర్ణత, స్థానికరాలై 21ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. వీటిని పరిగణనలోనికి తీసుకుని అభ్యర్థులను ఎం పిక చేస్తున్నారు. పది పాసైతే చాలు 50మార్కులు వేసి ప్రాథమిక అర్హత చూసుకుని ఎమ్మెల్యేతో చెప్పించుకుంటే చాలు వారి దగ్గర మామూళ్ల రూపంలో సొమ్ములు చేసుకుంటున్నారు. కాకినాడ అర్బన్‌లో కార్యకర్తలు 2, ఆయాలు 16 పోస్టులకు మినహా.. పెద్దాపురం, కాకినాడ రెండు డివిజ న్లకుగాను కార్యకర్తలు 15, ఆయాలు 111 పోస్టులకు సంబంధించి నియా మక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. కానీ ఎంపిక చేసి న అభ్యర్థుల లిస్టులను బయట పెట్టకుండా గోప్యంగా ఉంచి బేరసారాలు జరుపుతున్నారు. అర్హత ఉన్న నిరుద్యోగ మహిళల ప్రతిభ ఆధారంగా తీ సుకుని పారదర్శంగా నియామకాలు జరపాలని, సిఫార్సులు, సొమ్ముల కు లోబడి అర్హలైన వారికి అన్యాయం చేయొద్దని పలువురు వాపోతున్నారు.

రెండురోజుల్లో నియామకాలు పూర్తి చేస్తాం

జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈ నెల 6, 7, 8 తేదీల్లో కార్యకర్తలు, ఆయాలకు సంబంధించి ఇంటర్వ్యూ లు నిర్వహించాం. కమిటీ సభ్యులైన కలెక్టర్‌ కృతికాశుక్లా ఇంటర్వ్యూల కార్యక్రమంలో పాల్గొనలేదు. అందువల్ల ఎంపికైన అభ్యర్థుల జాబితా తెలియజేయలేదు. కాకినాడ అర్బన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. ఆర్డీవో అనుమతితో మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రి య కూడా పూర్తి చేసి అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తాం.

-ప్రవీణ, కాకినాడ జిల్లా సీడీపీవో

Read more