నేడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2022-11-01T01:22:23+05:30 IST

బొమ్మూరు, అక్టోబరు 31: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. నూతనం

నేడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

బొమ్మూరు, అక్టోబరు 31: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. నూతనంగా జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారిగా వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 9.50కు జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని అధికారులందరూ హాజరుకావాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - 2022-11-01T01:22:24+05:30 IST