AP News: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2022-09-06T19:28:27+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా,దేవీపట్నం మండలం, డిఎన్ పాలెం గ్రామంలో దారుణం జరిగింది.

AP News: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetaramaraju District): దేవీపట్నం మండలం, డిఎన్ పాలెం గ్రామంలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో కొండ్ల సూర్యమణి (56) అనే గిరిజన మహిళను దుండగుడు పీక కోసి హతమార్చాడు. మృతురాలు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ తల్లిగా పోలీసులు గుర్తించారు. చెడుమూరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తన బిడ్డకు చేతబడి చేసి చంపిందనే మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more