అనంతబాబు అధ్యక్షతన శిలాఫలకాల ఏర్పాటు సిగ్గుమాలిన చర్య

ABN , First Publish Date - 2022-11-18T23:13:13+05:30 IST

దళిత యువకుడి హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు అధ్యక్షతన శిలాఫలకాలు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

అనంతబాబు అధ్యక్షతన శిలాఫలకాల ఏర్పాటు సిగ్గుమాలిన చర్య

  • భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 18: దళిత యువకుడి హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు అధ్యక్షతన శిలాఫలకాలు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. దళిత యువకుడ్ని దారుణంగా హత్యచేసిన అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించకపోవడం, పార్టీ సమావేశాల్లో అనంతబాబు ఫ్లెక్సీలకు పాలభిషేకాలు చేయడం, హత్యకేసులో పోలీసులు అనంతబాబుకు అండగా నిలవడం, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కోరినా స్పందించకపోవడం చూస్తే ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేకి ప్రభుత్వ మని చెప్పడానికి ఇది ఒక మచ్చుతున్నక అని అన్నారు. అధికార బలం, పోలీసులు అండదండలు ఉన్నప్పటికీ అనంతబాబుపై గట్టిగా న్యాయపోరాటం చేస్తున్నాం కాబట్టే ఇప్పటికీ అతనికి బెయిల్‌ మంజూరు కాలేదన్నారు. బడుగు బలహీన వర్గాల్లో మనోధైర్యం కల్పించడం కోసం జరుగుతున్న న్యాయపోరాటంలో ప్రజా సంఘాలు, మానవతావాదులు పూర్తిగా సహకరించి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.

  • అనంతబాబుకు రిమాండ్‌ పొగింపు

డ్రైవర్‌ హత్యకేసులో రాజమహేద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్‌ పొడించారు. రాజమహేంద్రవరంలో ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో కోర్టు వాయిదాకు శుక్రవారం అనంతబాబు హాజరు కావాల్సివుంది. అయితే ఎస్కార్ట్‌ లేదనే కారణంతో వీడియో లింకేజీ ద్వారా వాయిదాకు అనంతబాబు కేసులో రిమాండ్‌ను పొడిగించారు.

Updated Date - 2022-11-18T23:13:13+05:30 IST

Read more