‘అనాథ బాలలకు రూ.10 లక్షలు’

ABN , First Publish Date - 2022-08-31T06:33:12+05:30 IST

అనాథ భాలల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి అన్నారు.

‘అనాథ బాలలకు రూ.10 లక్షలు’

రాజమహేంద్రవరంసిటీ, ఆగస్టు 30: అనాథ భాలల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి అన్నారు. రాజమహేంద్రవరం బాలికల ఉన్నత పాఠశాలలో  మంగళవారం అనాథ బాలలు, బాల్యవివాహాల నియంత్రణపై డీఎల్‌ఎస్‌ఏ, చైల్డ్‌లైన్‌ 1098, స్త్రీశిశు సంక్షేమ శాఖ ,విద్యాశాఖలతో కలిసి  అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచంలో 2007 నివేదికల ప్రకారం 25 మిలియన్ల అనాథ బాలలు ఉన్నారని.. ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉందన్నారు.  ఇటువంటి పిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున కలెక్టర్‌, సంబంధిత బాలుడి పేరున జాయింట్‌ అకౌంట్‌లో  నగదు వేయడం జరుగుతుందని చెప్పారు. పాక్షిక అనాథ బాలలకు స్పాన్సర్‌ షిప్‌ స్కీమ్‌ కింద ప్రతి నెలా  రూ.500 బ్యాంక్‌లో వేయడం జరుగుతుందని చెప్పారు. బాలలు భిక్షాటన చేస్తే చైల్డ్‌లైన్‌ 1098 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.   ఈ సదస్సులో అర్బన్‌ డీఐ బి దిలిప్‌ కుమార్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి కె.విజయకుమారి, చైల్డ్‌వెRead more