‘అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు’

ABN , First Publish Date - 2022-03-05T06:57:50+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడుగడుగునా బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమా నిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త గెడ్డం సంపదరావు ధ్వజమెత్తారు.

‘అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు’

అమలాపురం టౌన్‌, మార్చి 4: రాష్ట్రంలో జగన్‌  అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడుగడుగునా బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమా నిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త గెడ్డం సంపదరావు  ధ్వజమెత్తారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన 27సంక్షేమ పథకా లను రద్దుచేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.  కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండు చేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల నరసింహం అధ్యక్షతన శుక్రవారం అమలాపురంలో జరిగిన సమావేశంలో నాయకులు జిత్తుక సత్యనారాయణ, వడ్డి వీరాస్వామి, కోలా త్రిమూర్తులు, జంగా కృష్ణమూర్తి, బుడితి దయామహేష్‌, పెయ్యల ప్రతాప్‌కు మార్‌, మాకే లోకేష్‌, బండి శ్రీను, వాకపల్లి హరీష్‌కుమార్‌ పాల్గొన్నారు. Read more