అంబేడ్కర్ ఆశయాలతో ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2022-12-07T01:42:55+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
అనపర్తి, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అనపర్తిలోని అంబేడ్కర్ విగ్రహానికి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా దేశ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నో అంశా లను రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడని అన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో నేటి యువత పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, నూతిక బాబూరావు, కర్రి వెంకటరెడ్డి, మామిడిశెట్టి శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.