మార్గదర్శకుడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2022-12-07T01:06:52+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు యువతకు మార్గదర్శకం కావాలని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా వర్శిటీ ప్రాంగణం లోని ఆయన విగ్రహానికి వీసీ పూలమాలలతో నివాళులర్పించారు.

మార్గదర్శకుడు అంబేడ్కర్‌
అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న నన్నయ వీసీ

  • నన్నయ విశ్వవిద్యాలయం వీసీ జగన్నాథరావు

  • రాజ్యాంగ నిర్మాత వర్ధంతి కార్యక్రమాలు

  • బాబాసాహెబ్‌కు అధికారులు, ప్రజాప్రతినిధుల నివాళి

దివాన్‌చెరువు, డిసెంబరు 6: బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు యువతకు మార్గదర్శకం కావాలని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా వర్శిటీ ప్రాంగణం లోని ఆయన విగ్రహానికి వీసీ పూలమాలలతో నివాళులర్పించారు. అనం తరం మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలు ఎంతో ఉన్నతమైనవని, సంఘ సంస్కర్తగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయనేతగా, న్యాయవాదిగా దేశాభివృద్ధికి విశేషకృషి చేశారని కొనియాడారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ఓఎస్‌డీ ఎస్‌.టేకి, ఎస్సీఎస్టీ కో ఆర్డినేటర్‌ పి.విజయనిర్మల, డీన్‌ పి.వెంకటేశ్వరరావు. సహాయాచార్యులు ఎం.గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:06:54+05:30 IST