అమరావతి రైతుల ఆకాంక్ష నెరవేరింది

ABN , First Publish Date - 2022-03-05T06:53:09+05:30 IST

రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలంటూ హైకోర్టు తీర్పును వెలువరించడం అభినందనీయమని, దీంతో రాజధాని రైతులు కల నెరవేరిందని జనసేన నాయకులు పేర్కొన్నారు.

అమరావతి రైతుల ఆకాంక్ష నెరవేరింది

పి.గన్నవరం, మార్చి 4: రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలంటూ హైకోర్టు తీర్పును వెలువరించడం అభినందనీయమని, దీంతో రాజధాని రైతులు కల నెరవేరిందని  జనసేన నాయకులు పేర్కొన్నారు. పి.గన్నవరం త్రీరోడ్‌ సెంటర్‌లో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. అనంతరం స్వీట్లు పంచారు. మండల అధ్యక్షుడు సాధనాల శ్రీవెంకటసత్యనారాయణ ఆఽధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్‌, సర్పంచ్‌లు యల్లమిల్లి కృష్ణవేణి, పసలపూడి రామకృష్ణ, ఎంపీటీసీ ఆదిమూలం సూరయ్యకాపు, తాటికాయల శ్రీనివాసరావు, కొమ్మూరి మల్లిబాబు, యర్రంశెట్టి తాతకాపు, అడ్డగళ్ల సిరిసతీష్‌, చిల్లా ప్రసన్నకుమార్‌, కత్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-03-05T06:53:09+05:30 IST