Konaseema ఘటన : పోలీసులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే..

ABN , First Publish Date - 2022-05-26T06:49:06+05:30 IST

పోలీసుల అష్ట దిగ్బంధనంలో ఉన్నా అమలాపురం పురవీధుల్లోకి వేల మంది ఉద్యమకారులు ఎలా వచ్చారనేది పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. పైగా వచ్చిన వారంతా వాహనాలు లేకుండా కాలినడకనే ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి పోలీసు బలగాలను సైతం ఆశ్చర్యచకితుల్ని చేశారు.

Konaseema ఘటన : పోలీసులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే..

  • వేల మంది ఎలా వచ్చారు..? 

అమలాపురం (ఆంధ్రజ్యోతి), మే 25 : పోలీసుల అష్ట దిగ్బంధనంలో ఉన్నా అమలాపురం పురవీధుల్లోకి వేల మంది ఉద్యమకారులు ఎలా వచ్చారనేది పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. పైగా వచ్చిన వారంతా వాహనాలు లేకుండా కాలినడకనే ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి పోలీసు బలగాలను సైతం ఆశ్చర్యచకితుల్ని చేశారు. కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ కేవలం వాట్సాప్‌ సందేశాల ద్వారానే ప్రచారం జరిగింది. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ నుంచి కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ద్వారా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతులు ఇవ్వడానికి తరలిరండని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అదీ ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి నాగసుధాకొం డలరావుతోపాటు మరికొందరు నాయకులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందురోజే అంటే ఈనెల 23న జేఏసీ నాయకులు కొంద రిని అదుపులోకి తీసుకుని నిర్బంధంలో ఉంచారు.


24న జరిగే ఆందో ళనను కట్టడిచేసేందుకు సుమారు 500 మంది పోలీసులతో మంగళ వారం అమలాపురం పట్టణాన్ని ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఆధ్వర్యం లో అష్టదిగ్బంధం చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పోలీసులు రిలాక్స్‌ అవుతారని అంచనా వేసిన ఆందోళనకారులు వాట్సాప్‌ సందేశాలతో క్షణాల్లో రోడ్లపైకి వచ్చేశారు. అమలాపురం పట్ట ణ, పరిసరాల్లో ఉన్న పలు లేఅవుట్లలో ఆయా ప్రాంతాలకు చెందిన నిరసనకారులు సమీకరణ అయ్యారు. వాట్సాప్‌ సందేశాల్లో ‘పోలీసులు రిలాక్స్‌గా ఉన్నారు... వచ్చేయండంటూ’ ఒక సందేశం కొన్ని క్షణాల్లో వైర ల్‌ అయింది. దాంతో తొలుత ఈదరపల్లి కలశం దగ్గర నుంచి, తర్వాత హైస్కూలు సెంటర్‌, శ్రీరామపురం జంక్షన్‌, భట్నవిల్లి ఐస్‌ ఫ్యాక్టరీ ప్రాం తం నుంచి...  ఇలా పురవీధుల్లో సిద్ధంగా ఉన్న జనాలంతా సినీ ఫక్కీ లో రోడ్డుపైకి వచ్చేశారు. పైగా ఇంజనీరింగ్‌ కళాశాలలను అదే సమ యంలో విడిచిపెట్టడంతో ఆందోళనలో విద్యార్థులు సైతం భాగస్వా ము లయ్యారనేది పోలీసుల అంచనా. కాకపోతే ఇన్నివేల మంది నిఘా నేత్రాల కళ్లు కప్పి రోడ్లపైకి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది.Updated Date - 2022-05-26T06:49:06+05:30 IST