అగ్రహారం భూములపై సమగ్ర సర్వే : కాకినాడఆర్డీవో

ABN , First Publish Date - 2022-12-31T23:29:50+05:30 IST

పిఠాపురం పట్టణంలోని అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కాకినాడ ఆర్డీవో బీవీ రమణ ఆదేశించారు

అగ్రహారం భూములపై సమగ్ర సర్వే : కాకినాడఆర్డీవో

పిఠాపురం, డిసెంబరు 31: పిఠాపురం పట్టణంలోని అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కాకినాడ ఆర్డీవో బీవీ రమణ ఆదేశించారు. అగ్రహారంలోని భూములను ఆర్డీవో పరిశీలించారు. భూములు సర్వే చేసి ఏ విధమైన పట్టాలు మంజూరు చేశారు తదితర వివరాలు అందజేయాలని సూచించారు. ఆయన వెంట పిఠాపురం తహసీల్దారు పి.త్రినాథరావు, సర్వేయర్‌ సత్యనారాయణ, మునిసిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:29:50+05:30 IST

Read more