13 గంటల పాటు మృతదేహంతో ఆందోళన

ABN , First Publish Date - 2022-12-16T00:14:55+05:30 IST

బాలింత మృతితో కుటుం బీకులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని సుమారు 13 గంటల పాటు నిరసన ప్రదర్శన చేశారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి రాయి ఆదిలక్ష్మి అనే బాలింత మృతిచెందింది.

13 గంటల పాటు మృతదేహంతో ఆందోళన
ఆందోళనకారులతో చర్చిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి

ఆసుపత్రి ఎదుట బంధువుల ధర్నా

వైద్యులను శిక్షించాలని డిమాండ్‌

ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమణ

అనపర్తి, డిసెంబరు 15 : బాలింత మృతితో కుటుం బీకులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని సుమారు 13 గంటల పాటు నిరసన ప్రదర్శన చేశారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి రాయి ఆదిలక్ష్మి అనే బాలింత మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకులు బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు మృతదేహంతో ధర్నా చేశారు. బిక్క వోలు ఎస్‌ఐ బుచ్చిబాబు, బొమ్మూరు సీఐ ఆందోళన కారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తాడి రామగు ర్రెడ్డితోను జరిపిన చర్చలు ఫలించలేదు. తమ కుమార్తె మరణానికి కారణమైన వైద్యులను రప్పించా లని.. ఎందుకు తమ బిడ్డ ప్రాణాలో పోయాయో చెప్పాలని.. పురిటిలోనే తల్లిని కోల్పోయిన పసికందుకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. చివరకు ఉదయం 8 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మృతురాలి కుటుంబీకులతో చర్చించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని తప్పు చేసిన వైద్యులపై చర్యలు చేపడతామని ప్రభుత్వపరంగా మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు.అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మృతురాలి కుటుంబీకులను గురువారం ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. బాలింత మృతికి కారణమైన వైద్యులపై హత్య కేసు నమోదు చేయాలని, మృతురాలి కుటుం బానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చాలని, తల్లిని కోల్పోయిన చిన్నారికి వైద్య సేవలు అం దించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌వో లూసీ కార్లియాను కలిసి విచారణ తీరు ను పరిశీలించారు. సంఘటనకు కారణమైన వైద్యు లు లేకుండా ఇక్కడ విచారణ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్ల అనుభవం కూడా లేని వైద్యులు ఇటువంటి క్రిటికల్‌ ఆపరేషన్‌ ఎలా చేస్తారని నిలదీశా రు. కనీసం ఆపరేషన్‌కు అవసరమైన సామగ్రి లేకపో వడం అవన్నీ పేషెంట్‌ బంధువులే బయట నుంచి కొనుగోలు చేసు కోవాల్సిన పరిస్థితి దారుణమన్నారు. మత్తు ఇచ్చేందుకు రూ.3 వేలు డిమాండ్‌ చేయడం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-16T00:14:57+05:30 IST