భర్త కోసం దీక్ష

ABN , First Publish Date - 2022-08-04T06:02:13+05:30 IST

తన భర్త ఎక్కడున్నాడో తెలియజేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ స్థానిక రామకృష్ణ థియేటర్‌ సమీపంలో ఏఈఎల్‌సీ చర్చి వద్ద మున్నింగి సత్యవతి బుధవారం దీక్ష చేసింది.

భర్త కోసం దీక్ష
చర్చి వద్ద దీక్షకు దిగిన వివాహిత (ముసుగు వేసుకున్న మహిళ)

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 3: తన భర్త ఎక్కడున్నాడో తెలియజేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ స్థానిక రామకృష్ణ థియేటర్‌ సమీపంలో ఏఈఎల్‌సీ చర్చి వద్ద మున్నింగి సత్యవతి బుధవారం దీక్ష చేసింది.  ఆమె మాట్లాడుతూ తనను ఏఈఎల్‌సీ చర్చి పాస్టర్‌ చదివించారని, వారి ఒత్తిడితో ఆయన కోడలు తమ్ముడు జాకబ్‌ ప్రభుచరణ్‌ను పదేళ్ల కిందట వివాహం చేసుకున్నానని చెప్పింది.  జాకబ్‌ తరచూ మద్యం తాగొచ్చి గొడవలు పడేవాడని, మూడేళ్ల క్రితం తనను పాస్టర్‌ కోడలు, కొడుకులు పుట్టింటిలో వదిలి వెళ్ళారని చెప్పింది. అటుపై తన భర్తకోసం చాలా సార్లు కేరిశాల ఇంటికి వెళ్లి అడిగినా జాకబ్‌ లేడని చెబుతున్నారని, తన భర్తను చూపించి కాపురం సరిదిద్దాలని బాధితురాలు డిమాండ్‌ చేస్తోంది. దీక్షలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూర్చున్నారు.

Updated Date - 2022-08-04T06:02:13+05:30 IST