61 బైక్‌లు..రూ.7.37 లక్షలు

ABN , First Publish Date - 2022-09-21T06:53:11+05:30 IST

కాకినాడ జిల్లా ఎస్‌ఈబీ స్టేషన్‌లో నాటుసారా, అక్రమ మద్యం కేసుల్లో సీజ్‌ చేసిన 61 బైక్‌లకు జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలో రూ.7,37,896 లక్షల ఆదాయం లభించింది.

61 బైక్‌లు..రూ.7.37 లక్షలు

మద్యం కేసుల్లో పట్టుబడిన  బైక్‌లకు వేలంపాట

కాకినాడ క్రైం, సెప్టెంబరు 20: కాకినాడ  జిల్లా ఎస్‌ఈబీ స్టేషన్‌లో నాటుసారా, అక్రమ మద్యం కేసుల్లో సీజ్‌ చేసిన 61 బైక్‌లకు జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలో రూ.7,37,896 లక్షల ఆదాయం లభించింది. ఏఆర్‌ ఏఎస్పీ బి.సత్యనారాయణ పర్యవేక్షణలో పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బైక్‌ల వేలంలో ఎంవీ ఇన్‌స్పెక్టర్‌ అప్‌సెట్‌ ప్రైస్‌ రూ.2,87,600 లక్షల వేలం నిర్వహించగా రూ.7,37,896 లక్షలకు పాటదారులు వాహనాలను దక్కించుకున్నట్టు ఏఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఈ వాహనాలను అపరిచితులకు ఇవ్వరాదని, జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఏఈఎస్‌ అజయ్‌కుమార్‌, ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ టి. గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. Read more