రూ.4.94 కోట్లతో కౌన్సిల్‌ మిగులు బడ్జెట్‌ ఆమోదం

ABN , First Publish Date - 2022-12-31T01:11:48+05:30 IST

పురపాలక సంఘ ఆస్తులను వినియోగించి ఆదాయం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ సంసాని వెంకటచంద్రశేఖర్‌ సూచిం చారు.

రూ.4.94 కోట్లతో కౌన్సిల్‌ మిగులు బడ్జెట్‌ ఆమోదం

అమలాపురం టౌన్‌, డిసెంబరు 30: పురపాలక సంఘ ఆస్తులను వినియోగించి ఆదాయం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ సంసాని వెంకటచంద్రశేఖర్‌ సూచిం చారు. పట్టణంలోని ఖాళీ స్థలాలను గుర్తించి దుకాణ సము దాయాలు నిర్మిస్తే ఆదాయం పెరుగుతుందని వివరించారు. ప్రధానంగా ట్రేడ్‌ లైసెన్సుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర సూచించారు. అమ లాపురం పురపాలక సంఘ బడ్జెట్‌ సమావేశం చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. పుర పాలక సంఘంలో దుబారా ఖర్చులను తగ్గించి ప్రజాధనాన్ని పొదుపు చేయడం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని పలువురు కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా కోట్ల రూపాయలు కేటాయి స్తున్నా క్షేత్రస్థాయిలో వాటి విలువ కానరావట్లేదని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపించారు. 14వఆర్థిక సంఘం నిధులు రూ.14 కోట్లు మంజూరు కాగా రూ.4 కోట్లతోనే అభివృద్ధి పనులు చేస్తున్నామని అధికారులు చెప్పడాన్ని జనసేన కౌన్సి లర్‌ తిక్కా సత్యలక్ష్మి ప్రశ్నించారు. విద్యుత్‌ కోతలు అంతం తమాత్రంగానే ఉండగా జనరేటర్ల డీజిల్‌కు గత బడ్జెట్‌లో రూ.30లక్షలు, అంచనాల బడ్జెట్‌లో రూ.40లక్షలు చూప డాన్ని టీడీపీ కౌన్సిలర్‌ బొర్రా వెంకటేశ్వరరావుతో పాటు అధి కారపక్ష కౌన్సిలర్లు ప్రశ్నించారు. మురుగు కాల్వల్లో పూడిక తీతకు రూ.90లక్షలు వెచ్చించినట్టు చూపిస్తున్నా తేలికపాటి వర్షాలకు సైతం డ్రైన్లు ఎందుకు పొంగి ప్రవహిస్తున్నాయని సభ్యులు ప్రశ్నించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.13.6 కోట్లు ప్రారంభ నిల్వ చూపించగా ఆదాయం రూ.18.79 కోట్లు, మిగులు రూ.5.28 కోట్లతో సవరించిన అంచనాలను చూపిస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదా యం రూ.20.84 కోట్లు, ఖర్చు రూ.15.90 కోట్లుగా చూపిం చగా రూ.4.94 కోట్ల మిగులు బడ్జెట్‌ను సమావేశం ఏకగ్రీ వంగా ఆమోదించింది. కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు, డీఈ కె.అప్పలరాజు, వైస్‌ చైర్మన్‌ తిక్కిరెడ్డి వెంకటేష్‌, కౌన్సి లర్లు అబ్బిరెడ్డి చంటి, నాగారపు వెంకటేశ్వరరావు, ఆశెట్టి నాగ దుర్గ, దొంగ నాగసుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:11:49+05:30 IST