మరో పది రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2022-09-11T06:07:28+05:30 IST

జిల్లాలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్‌ కే.మాధవీలత పేర్కొన్నారు.

మరో పది రోజులు వర్షాలు

ప్రజలను అప్రమత్తం చేయాలి : కలెక్టర్‌


రాజమహేంద్రవరం, సెప్టెంబరు 10: జిల్లాలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని  అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్‌ కే.మాధవీలత పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న పది రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలాల పరిధిలో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. అధికారులంతా ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, సిబ్బందికి సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశాలు జారీ చేశా రు.ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించానన్నారు.


Updated Date - 2022-09-11T06:07:28+05:30 IST