వైసీపీ ఆగడాలు ఎన్నో రోజులు సాగవు: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-02T05:10:36+05:30 IST

:రాష్ట్రంలో వైసీపీ ఆగడాలు మరెన్నో రోజులు సాగవని పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చల్లాబాబు తెలిపారు.

వైసీపీ ఆగడాలు ఎన్నో రోజులు సాగవు: టీడీపీ
గౌనివారి, ఆర్‌ఎస్‌మణిలతో నల్లారి కిషోర్‌, చల్లాబాబు, ఇందుశేఖర్‌ తదితరులు

శాంతిపురం, అక్టోబరు 1:రాష్ట్రంలో వైసీపీ ఆగడాలు మరెన్నో రోజులు సాగవని  పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చల్లాబాబు తెలిపారు.గత నెలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులతో జైలుపాలై  ఇటీవల విడుదలైన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును, టీడీపీ మండల మాజీ ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్‌మణిని శనివారం శాంతిపురం మండలం వెంకటేపల్లెలో  వారు పరామర్శించారు. వారివెంట పార్టీ నాయకులు ఇందు శేఖర్‌, తెలుగు రైతు రాష్ట్ర  అధికార ప్రతినిధి సోమల సురేష్‌ ,తిరుపతి కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేంద్ర రెడ్డి  తదితరులున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి తమ సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధిని గాలికొదిలేసి కుప్పంలో ఏదో చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు, కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వారు పులివెందుల, పుంగనూరుల్లో గెలుస్తారో లేదో చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు విజయరామిరెడ్డి, నందిగంఉదయ్‌కుమార్‌, నాగరాజు తదితరులు  పాల్గొన్నారు.


Read more