గడప గడపలో రూ.5 లక్షల లోపు పనులు వెంటనే ప్రారంభించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-08T05:24:42+05:30 IST

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యల్లో రూ.5 లక్షల్లోపు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు.

గడప గడపలో రూ.5 లక్షల లోపు పనులు వెంటనే ప్రారంభించాలి : కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 7: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యల్లో రూ.5 లక్షల్లోపు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం వందశాతం పూర్తయిన ప్రాంతాల్లో గుర్తించిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇప్పటివరకు అందిన 815 పనులలో 765 రూ.5 లక్షల్లోపు వ్యయంతో కూడినవిగా గుర్తించామన్నారు. 2,599 అర్జీలు రాగా వాటిలో 584 రెడ్రెస్సెల్‌ అయ్యాయని, మరో 1,035 అర్జీలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీవో ఉమాదేవి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Read more