ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

ABN , First Publish Date - 2022-12-31T00:44:27+05:30 IST

ఎస్సీ, ఎస్టీల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అధికారులు చొరవ చూపాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి డీవీఎంసీ సమావేశం ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన జరిగింది.

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రెడ్డప్ప, హాజరైన అధికారులు, డీవీఎంసీ సభ్యులు

డీవీఎంసీ సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప

చిత్తూరు, డిసెంబరు 30: ఎస్సీ, ఎస్టీల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అధికారులు చొరవ చూపాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి డీవీఎంసీ సమావేశం ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన జరిగింది. ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, పోలీస్‌ శాఖలు కృషి చేయాలన్నారు. ఇంటిపట్టాలు, పెన్షన్లు తదితర పథకాలు నిలిచిపోయి ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో శ్మశాన వాటికల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. భూమి లేనిచోట్ల భూసేకరణ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలో జరిగే భూ పంపిణీలో 1500 ఎకరాలను సేకరించామని, త్వరలో ప్రజా ప్రతినిధుల ఆమోదంతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. డీఎస్పీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లాలో పోలీస్‌ కేసులకు సంబంధించి నివేదికలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్‌ పాటించాలన్నారు. అనంతరం డీవీఎంసీ సభ్యులు రాజ్‌కుమార్‌, బాబు తదితరులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఆర్డీవోలు రేణుక, శివయ్య, సృజన, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:44:30+05:30 IST