మహిళా కండక్టర్‌ అదృశ్యం

ABN , First Publish Date - 2022-09-22T05:20:14+05:30 IST

పీలేరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్‌ తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ నుంచి అదృశ్యమయ్యారు.

మహిళా కండక్టర్‌ అదృశ్యం

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 21: పీలేరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్‌ తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ నుంచి అదృశ్యమయ్యారు. ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. పీలేరు డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ వేదవతి (38) బుధవారం ఉదయం విధులకు హాజరయ్యారు. ఆమె విధులు నిర్వహిస్తున్న బస్సు ఉదయం 8 గంటలకు పీలేరులో బయలుదేరి 10:30 గంటలకు తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌కు చేరుకుంది. అనంతరం తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా ఆమె కనబడకుండా పోయింది. బస్సు టికెట్లు ట్రేబాక్స్‌లోనే ఉన్నాయి. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో బస్సు డ్రైవర్‌ మనోహర్‌ పీలేరు డిపో మేనేజర్‌కు విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆయన ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more