కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-15T00:08:32+05:30 IST
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటు చేసుకుంది.
చిత్తూరు, డిసెంబరు 14: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ఒకటో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. నెల రోజుల కిందట తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన మహేంద్రన్ భార్య సంగీత(28)తో కలిసి నగరంలోని సాంబయ్యకండ్రిగ వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మహేంద్రన్ అక్కడే ఉన్న ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. బుధవారం కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మహేంద్రన్ పనికి వెళ్లిపోయిన తర్వాత సంగీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.