తప్పుల్లేకుండా సర్టిఫికెట్‌ ప్రింటింగ్‌

ABN , First Publish Date - 2022-10-19T05:27:47+05:30 IST

భూరీసర్వే వందశాతం పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందించే సర్టిఫికెట్‌లో ఎటువంటి తప్పుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని జేసి వెంకటేశ్వర్‌ తెలిపారు.

తప్పుల్లేకుండా సర్టిఫికెట్‌ ప్రింటింగ్‌
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసి

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 18: భూరీసర్వే వందశాతం పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందించే సర్టిఫికెట్‌లో ఎటువంటి తప్పుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని జేసి వెంకటేశ్వర్‌ తెలిపారు. మంగళవారం రాత్రి అమరావతి నుంఝట భూరీసర్వేపై కార్యదర్శి సిద్ధార్థ్‌ జైన్‌ అన్నిజిల్లాల జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ సర్వేశాఖ డీఐలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు అప్రమత్తంగా ఉంటూ వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 


Read more