ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11మంది విద్యార్థులకు స్వాగతం

ABN , First Publish Date - 2022-03-05T07:45:51+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులకు శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11మంది విద్యార్థులకు స్వాగతం
విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న బీజేపీ నాయకులు

రేణిగుంట/తిరుపతి(పద్మావతీనగర్‌), మార్చి 4: ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులకు శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు భానుప్రకా్‌షరెడ్డి, సామంచి శ్రీనివాస్‌, కోలా ఆనంద్‌, వరప్రసాద్‌, జీవన్‌, నవీన్‌ తదితరులు విద్యార్థులకు స్వాగతం పలికి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మన జాతీయ పతాకాన్ని పట్టుకుని వస్తున్నవారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కల్పించలేదని విద్యార్థులు తెలిపారు. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల విద్యార్థులు కూడా క్షేమంగా ఉక్రెయిన్‌ దేశ సరిహద్దులు దాటడానికి మన జాతీయ పతాకాన్ని చేతబూనారని చెప్పారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడి మన విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకొచ్చారని, ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు. 

Updated Date - 2022-03-05T07:45:51+05:30 IST